Sunday, 25 January 2026 04:48:17 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Crime News: కాకినాడలో దారుణం.. పోటీ ప్రపంచంలో రాణించలేరని పిల్లలను చంపేసి ఉరేసుకున్న తండ్రి

Date : 15 March 2025 10:45 AM Views : 330

Studio18 News - ANDHRA PRADESH / : ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని భావించిన ఓ తండ్రి వారిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు. హోలీ పండుగ నాడు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఒకటో తరగతి చదివే కుమారుడు జోషిల్ (7), యూకేజీ చదివే చిన్న కుమారుడు నిఖిల్ (6), భార్య తనూజతో కలిసి నగరంలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. పిల్లలు సరిగా చదవడం లేదని ఇటీవల వారు చదువుతున్న స్కూల్ మార్పించాడు. చంద్రకిశోర్ నిన్న భార్య, పిల్లలతో కలిసి ఆఫీసులో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు వెళ్తున్నానని, అక్కడే ఉండాలని, పది నిమిషాల్లో వస్తానని భార్యను నమ్మించి పిల్లలను తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో అనుమానం వచ్చి తనూజ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో తోటి ఉద్యోగులను తీసుకుని ఇంటికి వెళ్లింది. తలుపు వేసి ఉండటంతో కిటికీ లోంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా పిల్లలిద్దరూ కాళ్లు, చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి కనిపించారు. ఆ దృశ్యాలు చూసిన తనూజ కుప్పకూలిపోయింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే పిల్లల్ని చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :