Studio18 News - ANDHRA PRADESH / : Atmakuru KDCC Bank: నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ లో ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదైంది. బ్యాంకు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు మేనేజర్ పులిరాజు, క్యాషియర్ అల్తాఫ్, పాసింగ్ ఆఫీసర్ రంగయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు బ్రాంచ్ లో క్యాషియర్ రూ. 78,77,767 కాజేశాడు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకు బ్రాంచ్ మేనేజర్, పాసింగ్ ఆఫీసర్ పైనా కేసు నమోదు చేశారు. బ్యాంకు డబ్బును తన సొంత అవసరాలకు, వ్యాపారం పేరుతో స్వాహా చేసిన ప్రధాన ముద్దాయి, క్యాషియర్ ఎస్. అల్తాఫ్ ను ఏ1గా, లాకర్ లో డబ్బు మాయమవుతున్నా పట్టించుకోని పాసింగ్ ఆఫీసర్ వి. వెంకటరంగయ్యను ఎ2గా, పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేనేజర్ పులిరాజును ఎ3గా చేర్చారు. ఈ ముగ్గురిపై నమోదైన కేసు నమోదుకు సంబంధించిన సమగ్ర వివరాలను నంద్యాల జిల్లా కలెక్టర్ కు బ్యాంకు సీఈవో నివేదించినట్లు తెలిసింది. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
Studio18 News