Wednesday, 25 June 2025 07:56:25 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Vidala Rajani: స్టోన్ క్రషర్స్ పై విడదల రజని దాడులు చేయించారు: ఐపీఎస్ అధికారి జాషువా

Date : 25 March 2025 03:39 PM Views : 127

Studio18 News - ANDHRA PRADESH / : విడదల రజని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసు స్టోన్ క్రషర్స్ పై విడదల రజని ఫిర్యాదు చేశారన్న జాషువా ఫిర్యాదు పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని వెల్లడి

శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాని కూడా నిందితుడిగా చేర్చారు. తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు జాషువా ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వెలుగుచూసింది. 2019 జూన్ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా పని చేశానని ఆయన తెలిపారు. అప్పటి చిలకూలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని తమ కార్యాలయానికి వచ్చి శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ పై లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారని చెప్పారు. అక్రమంగా మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారని... ఆ ఆరోపణలపై తాను ప్రాథమికంగా రహస్య విచారణ చేయించానని తెలిపారు. స్టోన్ క్రషర్ యాజమాన్యం నాటి టీడీపీ నేత సానుభూతిపరులదని... వారితో విడదల రజనికి రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని తేలిందని చెప్పారు. స్టోన్ క్రషర్స్ పై విడదల రజని దాడులు చేయించారని పేర్నొన్నారు. విడదల రజని ఫిర్యాదు మేరకే తనిఖీలు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి మాయమయ్యాయని చెప్పారు. విజిలెన్స్ ఫైల్స్ ట్యాంపరింగ్ చేసి కొన్నింటిని తొలగించారని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :