Tuesday, 31 March 2026 04:35:57 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Satya Kumar: తిరుమల లడ్డూను రసాయనాలతో తయారు చేశారు: సత్యకుమార్

Date : 29 January 2026 06:34 PM Views : 73

Studio18 News - ANDHRA PRADESH / Tirupati : లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందన్న సత్యకుమార్ అవినీతిపరులను జైలుకి పంపితే రెడ్ బుక్ అంటున్నారని మండిపాటు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారని విమర్శించారు. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే ప్రసాదాన్ని కల్తీ చేసిన పాపం 'జగన్ అండ్ కో'దే అని అన్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. రసాయనాలను ఉపయోగించి లడ్డూ తయారు చేశారని మండిపడ్డారు. రూ. 250 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అవినీతిపరులను జైలుకి పంపితే దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎలా అంటారని ప్రశ్నించారు. రప్పా రప్పా అనేవాళ్లని, తప్పు చేసిన వాళ్లని వదిలేయాలి అనేలా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యక్తిగత విషయాలను కూడా కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తోందని అన్నారు. సొంత ఖజానాను నింపుకోవడం కోసం నాణ్యత లేని మద్యం అమ్మి, ప్రజల ప్రాణాలు తీయడం జగన్ కు తప్పుగా అనిపించలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా... అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణి మరణిస్తే... ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మరణించినట్టు ప్రచారం చేస్తున్నారని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేశామని చెప్పారు. విజిటర్ పొలిటీషియన్ మాదిరి జగన్ వారానికి ఒకరోజు ఏపీకి వచ్చిపోతున్నాడని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే అసెంబ్లీకి రావాలని అన్నారు. జగన్... మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి... లేకపోతే మీ రాజకీయ సమాధిని మీరే కట్టుకున్నట్టవుతుందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :