Thursday, 12 March 2026 03:27:31 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu: జగన్‌ను దెబ్బతీయలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అలా చేయాలి: చింతామోహన్

Date : 04 October 2024 02:38 PM Views : 281

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను దెబ్బతీయాలంటే ఆయన బెయిల్ రద్దయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ సూచించారు. అంతేకానీ, దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగవద్దన్నారు. పవన్ కల్యాణ్ నిన్న తిరుపతిలో మాట్లాడిన తీరు సరికాదన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై చంద్రబాబు మాట్లాడటం పద్ధతి కాదన్నారు. ఏదేమైనా దేవాలయాలను వివాదాల్లోకి తీసుకు రావొద్దని సీఎం, డిప్యూటీ సీఎంకు ఆయన సూచించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని... నెయ్యి స్థానంలో పామాయిల్ కానీ, వంటనూనె కానీ కలిపి ఉండవచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదు రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని, ఇప్పుడు కూడా దేశ రాజకీయాలు ఆయన చేతిలోనే ఉన్నాయని చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తనకు ఐదు దశాబ్దాలుగా తెలుసునని వెల్లడించారు. రాజకీయాల్లో ఆయన చాలా అదృష్టవంతుడు అన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చంద్రబాబు ఆపవచ్చునని తెలిపారు. విశాఖ ఉక్కును రక్షించేది కేవలం చంద్రబాబు మాత్రమేనన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ ఫ్రాడ్ ప్రాజెక్టు అని విమర్శించారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్నట్లుగా పోలవరంపై కూడా జరపాలని కోరారు. మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా అధికారం కోల్పోవచ్చునని, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బహుశా కేంద్ర ప్రభుత్వం పడిపోతుందేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :