Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భార్గవరెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, టీడీపీ, జనసేన నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును భార్గవ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. రెండు వారాల పాటు భార్గవరెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : హీరో ప్రభాస్ కు షూటింగ్ లో గాయం
Admin
Studio18 News