Thursday, 12 March 2026 12:40:36 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jogi Ramesh: జోగి రమేశ్ కు మళ్లీ కస్టడీ... భార్య, కుమారుడికి నోటీసులు

Date : 02 January 2026 06:45 PM Views : 83

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : జోగి రమేశ్ కు బిగుస్తున్న కేసుల ఉచ్చు జోగి సోదరులను మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విజయవాడ జిల్లా జైలుతో ఉన్న జోగి నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు సంబంధించిన దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములు‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరోసారి కస్టడీలోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం వారిద్దరినీ అధికారికంగా కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, మూడు రోజుల పాటు లోతైన విచారణ చేపట్టనున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ, సరఫరాకు సంబంధించిన కేసులో ఇప్పటికే జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు ఒకసారి ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి విచారణలో వెలుగులోకి రాని కీలక అంశాలు, మరికొందరు వ్యక్తులతో ఉన్న సంబంధాలు, నిధుల లావాదేవీలపై స్పష్టత కోసం రెండోసారి కస్టడీ అవసరమని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జోగి రమేశ్, రాములు ఇద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జోగి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేశ్ అరెస్టు సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లిన సందర్భంలో అక్కడ జరిగిన ఘటనలపై నమోదు చేసిన కేసులో భాగంగా, ఆయన భార్యతో పాటు కుమారుడికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు అందజేశారు. ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయ్యింది. మరోవైపు, నకిలీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ వ్యవధి కూడా పొడిగించారు. ఈరోజు రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం నిందితులను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :