Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సులో ఆమె మరొకరు సెల్ఫీ తీసుకున్నారు. పల్లె వెలుగు బస్సులో షర్మిల విజయవాడ బస్ట్‌స్టాండ్ నుంచి తెనాలికి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటకలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లే ఏపీలోనూ కల్పించాలని ఆమె అన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం అవసరమా అని బస్సులోని మహిళలను షర్మిల అడిగి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలని మహిళలు చెప్పారు. గత ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారని షర్మిల అన్నారు. ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడంలేదని నిలదీశారు. కాగా, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడగానే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News