Monday, 02 December 2024 04:40:59 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP Cabinet: రతన్ టాటా మృతికి నివాళులర్పించిన ఏపీ కేబినెట్

Date : 10 October 2024 03:51 PM Views : 28

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ప్రభుత్వ కేబినెట్ సమావేశం కొద్దిసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమావేశం కొన‌సాగుతోంది. ముందుగా వ్యాపార దిగ్గ‌జం రతన్ టాటా మృతికి ఏపీ మంత్రివర్గం సంతాపం తెలిపింది. ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నివాళులర్పించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్ ను సృష్టించారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంపదను సృష్టించడమే కాకుండా... ఆ సంపదను సమాజంలో అన్ని వర్గాలకు చేరేలా పద్మవిభూషణ్ రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక ఈ కేబినెట్ స‌మావేశంలో ప్ర‌భుత్వం ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇటీవల మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా ఈ సమావేశంలో చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు