Thursday, 12 March 2026 03:38:38 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

ఏసీబీ కేసు కొట్టివేత

Date : 08 May 2025 01:07 PM Views : 412

Studio18 News - ANDHRA PRADESH / : విశ్రాంత ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసును, విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏసీబీ మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. భద్రత, నిఘా పరికరాల కొనుగోలు టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో 2021 మార్చిలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ బుధవారం తుది తీర్పు వెలువరించారు. పిటిషనర్‌పై ఏసీబీ మోపిన ఆరోపణలు విచారణలో నిలబడవని, అవి అస్పష్టంగా, నిరాధారంగా ఉన్నాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. చట్టం ముందు ఈ అభియోగాలు చెల్లుబాటు కావని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు దిగువ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తుది విచారణలో ఏబీ వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది, కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది నాటి డీజీపీయేనని, ఆయా కమిటీలలో సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే ఏబీవీ సూచించారని తెలిపారు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని కమిటీల నిర్ణయాలను ప్రభావితం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పరికరాల కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, అలాంటప్పుడు అనుచిత లబ్ధి పొందే ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయవాది వాదించారు. ఏబీవీ కుమారుడికి చెందిన ‘ఆకాశ్ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌’ సంస్థకు టెండర్‌ దక్కించుకున్న ఇజ్రాయెల్‌ సంస్థతో ఎలాంటి అనుబంధం లేదని, ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ కంపెనీయే స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ చర్యల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అంతిమంగా ఆ టెండర్‌ను అప్పటి డీజీపీ రద్దు చేశారని తెలిపారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసులో వర్తించవని, కావున కేసును కొట్టివేయాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఏబీ వెంకటేశ్వరరావుపై నమోదైన కేసును, చార్జిషీట్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :