Thursday, 12 March 2026 04:03:17 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

ఏపీపీఎస్సీ కేసులో... పీఎస్ఆర్ కు ఈ నెల 22 వరకు రిమాండ్

Date : 08 May 2025 05:16 PM Views : 369

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్ ను కాసేపట్లో విజయవాడ జైలుకు తరలించనున్నారు. సినీ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆయనను, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన మరో కేసులోనూ పోలీసులు పీటీ వారంట్ పై అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగమయ్యాయని తీవ్ర ఆరోపణలున్నాయి. వాస్తవానికి మాన్యువల్ మూల్యాంకనం జరగనప్పటికీ, జరిగినట్లుగా రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఏప్రిల్ 29న ఆంజనేయులుపై ఐపీసీ సెక్షన్ 409 (ప్రభుత్వ ఉద్యోగి నేరపూరిత విశ్వాసఘాతుకం), 420 (మోసం) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోరగా, విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టు మే 7న అనుమతించింది. ఇవాళ (మే 8) ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచాలన్న ఆదేశాల మేరకు పోలీసులు పీఎస్ఆర్ ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనకు రిమాండ్ విధించారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పేపర్ల మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన ‘కామ్ సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ డైరెక్టర్ పమిడి కాల్వ మధుసూదన్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. గతంలో డిజిటల్ పద్ధతిలో చేసిన మూల్యాంకనాన్నే, తర్వాత మాన్యువల్ పద్ధతిలో చేసినట్లుగా చూపించి అవే మార్కులు వేశారని, వాస్తవంగా పేపర్లు దిద్దకుండానే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై మధుసూదన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ1 కాగా, మధుసూదన్ ఏ2గా ఉన్నారు. మూల్యాంకనం కోసం ఈ సంస్థకు రూ. 1.14 కోట్లు చెల్లించగా, ఇందులో రూ. 66 లక్షల మేర అవినీతి జరిగిందని సీఐడీ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :