Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య లొంగిపోయాడు. ఇవాళ మంగళగిరి కోర్టుకు వచ్చిన చైతన్య న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. నాడు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇటీవలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైతన్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పానుగంటి చైతన్య... ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందాడు. ఈ కేసులో మంగళగిరి పోలీసులు లేళ్ల అప్పిరెడ్డిని కూడా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.
Admin
Studio18 News