Thursday, 12 March 2026 01:14:48 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!

Date : 07 February 2026 07:02 PM Views : 127

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఏపీ పదో తరగతి ఇంగ్లీషు పరీక్ష తేదీలో మార్పు పండుగల నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసిన విద్యాశాఖ మార్చి 20కి బదులుగా 21న ఇంగ్లీషు పరీక్ష నిర్వహణ మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టీకరణ మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఒక్క పరీక్ష తేదీ మినహా మిగిలిన అన్ని పరీక్షల షెడ్యూల్‌ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. కాగా, పదో తరగతి పరీక్షలు ముందుగా నిర్ణయించినట్లుగానే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సవరించిన పూర్తి టైమ్ టేబుల్‌ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inను సందర్శించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :