Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీని వీడారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా జనసేనలో చేరబోతున్నారు. మరోవైపు మరో వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పార్టీ మారుతున్నాననే ప్రచారంపై దాడిశెట్టి రాజా స్పందించారు. తాను జనసేనలోకి వెళుతున్నాననే ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. ప్రస్తుతం తాను కొంత అనారోగ్యంతో ఉన్నానని... హైదరాబాద్ లో ఉంటున్నానని... త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు. వైద్య పరీక్షల కోసం తాను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పారు. తాను తునిలో లేని సమయంలో జనసేన వైపు చూస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను వైసీపీని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా తన ఉన్నతికి సహకరించిన అనుచరులను, జగన్ ను వీడి వెళ్లనని స్పష్టం చేశారు.
Admin
Studio18 News