Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తమ బస్సులకు దారివ్వలేదన్న కోపంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను ప్రైవేటు బస్సు డ్రైవర్లు చితకబాదారు. పల్నాడు జిల్లా వినుకొండ వద్ద గత రాత్రి జరిగిందీ ఘటన. ప్రకాశం జిల్లా పొదిలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తుండగా తమ బస్సులకు దారివ్వలేదని ఆగ్రహంతో ఊగిపోతూ కురిచేడు వద్ద బస్సును ఆపిన ప్రైవేటు బస్సు డ్రైవర్లు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సతార్‌పై దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన సతార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రైవేటు బస్సు డ్రైవర్ల దాడికి నిరసనగా పొదిలి బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులను ఆపి ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Admin
Studio18 News