Tuesday, 31 March 2026 04:35:03 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి

Date : 22 January 2026 08:16 PM Views : 118

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి కల్పించిన వైనం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి సన్మానం పోలీస్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. గత సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంది. చేతిలో చంటిబిడ్డతో ఉంటూనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, ఓ అంబులెన్స్‌కు దారి సుగమం చేసేందుకు ఆమె కృషి చేశారు. పైగా, ఆ రోజు ఆమె డ్యూటీలో లేరు. అయినప్పటికీ సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో, మంత్రి అనిత స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ సంభాషణలోనే మంత్రిని కలవాలన్న తన ఆకాంక్షను జయశాంతి వ్యక్తం చేయగా, తాజాగా ఆ కోరికను నెరవేర్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ "విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది" అని అన్నారు. రాష్ట్ర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు కానిస్టేబుల్ జయశాంతిని కలిసినప్పటి ఫొటోలను కూడా హోంమంత్రి అనిత పంచుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :