Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : పిఠాపురంలో ఓ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ విషయమై మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. "'పవన్ కల్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ' అంటూ ట్వీట్ చేసిన మాజీ మంత్రి... దేవుడు తమరికి పుట్టుకతో బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి స్వామి" అంటూ దుయ్యబట్టారు. దీంతో రోజా ట్వీట్‌పై జనసేనాని స్పందించారు. పిఠాపురానికి చెందిన బాలికపై మాధవరం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెప్పిన పవన్.. ఈ లైంగిక దాడి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవల కోసం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పవన్ తెలిపారు. అలాగే బాధిత బాలికను అన్ని విధాల ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.
Admin
Studio18 News