Tuesday, 31 March 2026 04:35:04 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Chintakayala Vijay: ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్

Date : 05 February 2026 06:56 PM Views : 48

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : దేశంలోనే 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ నెంబర్ వన్ అని వెల్లడి మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్న విజయ్ గత ప్రభుత్వంతో పోలిస్తే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని వివరణ అమరావతి, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో రాష్ట్రానికి కొత్త గుర్తింపు అని ఉద్ఘాటన కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చిన సర్వేల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం, పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇది మాటల ప్రచారం కాదని, గణాంకాలే నిదర్శనమని స్పష్టం చేశారు. దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3 శాతంతో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబయి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని విజయ్ వివరించారు. గతంలో భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు పోటీపడి రాష్ట్రానికి రావడం కూటమి ప్రభుత్వంపై విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధి కారణంగానే గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగితేనే ఇది సాధ్యమని, ఇది కూటమి పాలన ఫలితమేనని అన్నారు. ఉద్యోగాల కల్పన విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని విజయ్ తెలిపారు. మాటల్లో కాకుండా చేతల్లో ఉద్యోగాలు చూపించిన నాయకత్వం తమదని, గత పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని, ఐదేళ్లు రాజకీయ కుతంత్రాలతోనే గడిచిపోయాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చట్టపాలన అమలవుతోందని, నేరస్తులు భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు. రాజధాని అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని విజయ్ అన్నారు. ఒకప్పుడు నిరసనలతో ఉన్న అమరావతి, ఇప్పుడు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో గూగుల్ మ్యాప్‌లో చూస్తే తెలుస్తుందన్నారు. విశాఖలో ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించడం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. గాజువాక స్టీల్ ప్లాంట్‌కు నిధులు విడుదల చేయించి ఆ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేశారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ, తెలుగు ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నారని చింతకాయల విజయ్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :