Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ఉన్న లాసన్స్ బే కాలనీలోని ఇల్లు, కార్యాలయంతో పాటు... మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన ఆడిటర్ జీవీ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడలో భూమి కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎంవీవీ ప్రస్తుతం ఇంట్లో లేరని ఈడీ అధికారులు చెపుతున్నారు. ఎంవీవీ తెలుగులో పలు చిత్రాలను కూడా నిర్మించారు.
Admin
Studio18 News