Saturday, 07 March 2026 09:17:27 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Chiranjeevi: పల్లెటూరి వాతావరణంలో చిరంజీవి కొత్త చిత్రం

రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి తాజా చిత్రం సంక్రాంతి సీజన్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న నిర్మాణ సంస్థ చిరు సరసన హీరోయిన్‌గా అదితి రావు హైదరీ!

Date : 18 March 2025 10:29 AM Views : 326

Studio18 News - ANDHRA PRADESH / : మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన చిత్ర నిర్మాణం జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే .. చాలా ఏళ్ల తర్వాత పల్లెటూరి అందాల నడుమ ఈ చిత్ర నిర్మాణం చేయనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వినోదానికి ఏ మాత్రం కొదవ ఉండబోదని ఇప్పటికే నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అదితి రావు హైదరీ నటించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంబో అయిన సంగీత దర్శకులు భీమ్స్, రమణ గోగుల ఈ మూవీకి పని చేయనున్నారని అంటున్నారు. ఇటీవలే నిర్మాణ సంస్థ సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ కు పూజలు చేయించారు. ఇప్పటి వరకూ రంగు రంగుల సెట్టింగ్‌లు, హైటెక్ హంగులతో చిత్ర నిర్మాణాలు స్టూడియోలలోనే చేయగా, ఇప్పుడు గతంలో మాదిరి పల్లెటూరి అందాల నడుమ చిత్ర నిర్మాణం చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో ఊరికి ఇచ్చిన మాట, పల్లెటూరి మోసగాడు, శివుడు శివుడు శివుడు, ఖైదీ, అల్లుడా మజాకా, ఆపద్భాంధవుడు, ఇంద్ర, సింహపురి సింహం వంటి మూవీలు చేశారు. ఈ సినిమాలు చిరు అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ మూవీలు కేవలం వినోదమే కాకుండా పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని చక్కగా ఆవిష్కరించి ఆకట్టుకున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :