Sunday, 08 March 2026 09:59:00 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఆ విష‌యంలో ధ‌నిక రాష్ట్రాల కంటే ఏపీనే గ్రేట్: సీఎం చంద్ర‌బాబు

Date : 31 May 2025 03:45 PM Views : 240

Studio18 News - ANDHRA PRADESH / : ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి పింఛ‌న్లు అంద‌జేశారు. అనంత‌రం చెయ్యేరులో ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. పింఛ‌న్లు పెంచుతామ‌ని చెప్పి... ఇచ్చిన‌మాట నిల‌బెట్టుకున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ల‌ను రూ. 3వేల నుంచి రూ. 4 వేల‌కు పెంచామ‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాది కాలంలోనే పింఛ‌న్ల కోసం రూ. 34వేల కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు చెప్పారు. పేద‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పింఛ‌న్లు పెంచిన ఘ‌న‌త టీడీపీకే ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఇచ్చే పింఛ‌న్ల‌లో అద‌నంగా 9,176 మందికి ఇచ్చామ‌న్నారు. దేశంలోని మ‌రేత‌ర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. ప్ర‌తినెలా 1వ తేదీనే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు 64 ల‌క్ష‌ల మంది పింఛ‌న్ దారుల‌కు పింఛ‌న్లు అంద‌జేస్తున్నామ‌న్నారు. ఇక‌, గ‌త వైసీపీ ప్ర‌భుత్వం వితంతు పింఛ‌న్లు ఇవ్వ‌ల‌దేని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం 71,380 మందికి వితంతు ఫించ‌న్లు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ధ‌నిక రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువ పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్రాల‌తో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అధిక పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. డ‌యాబెటీస్ కార‌ణంగా కాలు కోల్పోయిన పోలిశెట్టి దుర్గాప్ర‌సాద్ అనే వ్య‌క్తికి కూడా ఈ నెల నుంచే పింఛ‌న్ మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక‌, 16,347 టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేశాన‌ని, దాని అమ‌లు చేసే దిశ‌గా త్వ‌రిత‌గ‌తిన ముందుకు వెళుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :