Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ తల్లిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీదేవి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి కాంక్షించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేశ్, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
Admin
Studio18 News