Monday, 02 December 2024 01:01:00 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YS Jagan: రాష్ట్రంలో ఘోర‌మైన ప‌రిస్థితులు.. రెడ్‌బుక్ పాల‌న సాగుతోంది: వైఎస్ జ‌గ‌న్‌

Date : 23 October 2024 04:33 PM Views : 33

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ‌తి స‌హానా.. రౌడీషీట‌ర్ న‌వీన్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతిచెందిన విష‌యం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న ఆమె మృత‌దేహాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. పార్టీ త‌ర‌ఫున స‌హానా ఫ్యామిలీని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ ఘ‌ట‌న‌లలో చ‌నిపోయిన ఆరుగురు ఆడ‌పిల్ల‌ల కుటుంబాల‌కు వైసీపీ త‌ర‌ఫున రూ.10ల‌క్ష‌లు ఆర్థిక సాయం ఇస్తామ‌న్నారు. అనంత‌రం జ‌గ‌న్ విలేక‌రులతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణ‌ప‌రిస్థితులు ఉన్నాయ‌ని, రెడ్‌బుక్ పాల‌న సాగుతుంద‌ని విమ‌ర్శించారు. స‌హానా మృత‌దేహాన్ని ప‌రిశీలించిన త‌న‌కు ఆమె శ‌రీరంపై క‌మిలిన గాయాలు క‌నిపించాయ‌న్నారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డి, ఆసుప‌త్రిలో చేర్పించి వెళ్లిపోయార‌ని ఆరోపించారు. ఆమె మృతికి కార‌ణ‌మైన న‌వీన్ టీడీపీకి చెందిన వాడ‌ని, అత‌ను స్థానిక ఎంపీతో స‌న్నిహితంగా ఉండేవాడ‌ని ఆరోపించారు. సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి అత‌ను దిగిన ఫొటోలు కూడా ఉన్నాయ‌న్నారు. నిందితుడు త‌మ పార్టీకి చెందిన‌వాడు కావ‌డంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అత‌డ్ని కాపాడాల‌ని చూస్తోంద‌ని జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. ఇంత‌వ‌ర‌కూ మృతురాలి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం శోచ‌నీయం అని జ‌గ‌న్ పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎంత‌కు దిగ‌జారిపోయాయో ద‌ళిత మ‌హిళ‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు దిశ‌యాప్ ద్వారా భ‌ద్ర‌త క‌ల్పించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉండేద‌న్నారు. ఇదిలాఉంటే.. నిందితుడు న‌వీన్‌ను తెనాలి పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. స‌హానా-న‌వీన్ మ‌ధ్య అప్పు విష‌య‌మై ఉన్న త‌గాదాలే ఆమె హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు. అలాగే టీడీపీతో న‌వీన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని పోలీసులు తెలిపారు. ఇంత స్ప‌ష్టంగా పోలీసులు చెబుతున్నా.. వైసీపీ నాయ‌కులు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు