Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఐదేళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమాలు ఎలా చేయాలి... అవినీతి డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయంలో దేశానికే రోల్ మోడల్ గా జగన్ నిలుస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ నాశనం చేసిన తీరుపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలని సూచించారు. చంద్రబాబు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వంపై జగన్ అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మతిస్థిమితం కోల్పోయినట్టున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా... ఒక మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో జగన్ కోర్టులను ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.
Admin
Studio18 News