Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10వ తేదీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు అనంతరం 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. బీద రవిచంద్ర (బీసీ), బీటీ నాయుడు(బీసీ), కావలి గ్రీష్మ(ఎస్సీ) అవకాశం దక్కింది. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా బీజేపీ, జనసేనకు చెరో సీటు దక్కింది. జనసేన తరపున నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా, మిగిలిన స్థానాల్లో మాత్రం ఎవరూ నామినేషన్ వేయలేదు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. మూడు ప్రాంతాల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజికవర్గ నేత బీటీ నాయుడుకి మళ్లీ ఎమ్మెల్సీగా చోటు దక్కింది.
Admin
Studio18 News