Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అమెజాన్ ప్రైమ్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'స్నేక్ అండ్ ల్యాడర్స్'. తమిళంలో రూపొందిన సిరీస్ ఇది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సిరీస్‌ను నిర్మించడం విశేషం. ఈ సిరీస్‌కి భరత్, మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా ఆల్కెమిస్ దర్శకులుగా వ్యవహరించారు. హీరో నవీన్‌చంద్రతో పాటు, ముత్తుకుమార్, నందా, మనోజ్ భారతీరాజా ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. నలుగురు పిల్లల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారికి ఒక ప్రమాదం గురించి తెలుస్తుంది. అయితే వారు ఆ ప్రమాదం గురించి చెప్పకుండా దాచడం వలన మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో ఒక వైపున పోలీసులు, మరో వైపున దొంగలు వారిని వెంటాడుతుంటారు. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఎలా తప్పించుకుంటారు? అనేదే కథ.
Admin
Studio18 News