Saturday, 24 January 2026 03:04:49 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Viral Video: సపోటా తోటలో దారుణం.. బాలికను కాపాడిన స్థానికులు

Date : 22 October 2025 07:44 PM Views : 198

Studio18 News - ANDHRA PRADESH / Kakinada : కాకినాడ జిల్లా తునిలో వెలుగులోకి వచ్చిన దారుణం మైనర్ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి యత్నం సపోటా తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యం గమనించి బాలికను కాపాడిన స్థానికులు నిలదీస్తే ‘నేను కౌన్సిలర్‌ను’ అంటూ బెదిరింపులు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీకి చెందిన ఓ నాయకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించగా, స్థానికులు గమనించి అడ్డుకున్నారు. నిందితుడిని నిలదీస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. తుని రూరల్‌లోని ఓ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను, స్థానిక టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను సమీపంలోని హంసవరం సపోటా తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమయంలో బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాలికను అతని చెర నుంచి కాపాడారు. ఈ ఘటనపై స్థానికులు నారాయణరావును గట్టిగా నిలదీయగా, బాలిక మూత్ర విసర్జన కోసం ఇక్కడికి తీసుకొచ్చానని చెప్పి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికులు వెనక్కి తగ్గకపోవడంతో "నేనెవరో తెలుసా? నేను టీడీపీ కౌన్సిలర్‌ను. నన్నే ప్రశ్నిస్తారా? తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ వారిని బెదిరించారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :