Monday, 02 December 2024 01:58:36 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan: డిప్యూటి సీఎం పవన్ ప్రత్యేక శ్రద్ధ .. పిఠాపురం సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది నియామకం

Date : 11 October 2024 01:03 PM Views : 27

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్ పని చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, డి.ఎం.అండ్ హెచ్.ఓ.లతో చర్చించారు. తక్షణమే పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులను, సిబ్బందిని నియమించాలని పవన్ ఆదేశించారు. నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి అయిన సి.హెచ్.సి.లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ లను పిఠాపురం సి.హెచ్.సి.లో నియమించారు. అదే విధంగా ముగ్గురు స్టాఫ్ నర్సులను, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్ లను నిర్ణయించారు. అలానే ఎక్స్ రే యూనిట్ ను పునరుద్ధరించారు. దీంతో ఎక్స్‌రే యూనిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీహెచ్‌సీ మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు