Saturday, 07 March 2026 08:28:04 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Kumari: విజయవాడలో విషాదం: కొడుకు ప్రేమ వ్యవహారం.. హిజ్రాల దాడితో తల్లి ఆత్మహత్య

Date : 13 September 2025 08:57 PM Views : 629

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : విజయవాడ గిరిపురంలో మహిళ ఆత్మహత్య కొడుకు ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణం కుటుంబంపై 20 మంది హిజ్రాలు దాడి చేశారని ఆరోపణ దాడితో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం రెండు రోజులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి నిందితులను అరెస్ట్ చేయాలంటూ బంధువుల నిరసన విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం కారణంగా కొందరు హిజ్రాలు దాడి చేశారన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గిరిపురం ప్రాంతానికి చెందిన గోపీచంద్, అదే ప్రాంతానికి చెందిన మంజుల అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను వ్యతిరేకిస్తూ మంజుల తరఫున సుమారు 20 మంది హిజ్రాలు ఈ నెల 11వ తేదీన గోపీచంద్ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిలో గోపీచంద్‌తో పాటు అతని తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారి (40)పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అనూహ్య పరిణామంతో, బహిరంగంగా జరిగిన దాడితో తీవ్ర ఆవేదనకు గురైన కుమారి, ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె కన్నుమూశారు. కుమారి మరణవార్త తెలియగానే బంధువులు ఆగ్రహంతో మాచవరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన హిజ్రాలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న హిజ్రాలను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :