Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ http:// cse.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. దీనికోసం అభ్యర్థులు 95523 00009కు మెసేజ్ చేస్తే సరిపోతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణ పట్ల తమ నియబద్ధత నెరవేరిందని, డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని మంత్రి కోరారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. "ప్రియమైన అభ్యర్థులారా! మెగా డీఎస్సీ-2025 హాల్ టికెట్లను http:// cse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 95523 00009 నంబర్‌లో మా WhatsApp సర్వీస్ ద్వారా కూడా వాటిని పొందవచ్చు. నిర్వహణ పట్ల మా నిబద్ధత నెరవేరింది. ఇప్పుడు మీ వంతు వచ్చింది! మీరు పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచాలి. అందుకు మీకు శుభాకాంక్షలు. మీరు మీ వంతు కృషి చేసి అద్భుతమైన ఫలితాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాను!" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇక, ఈ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. అందుకు తగట్లుగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, ఈ మెగా డీఎస్సీ ద్వారా 16, 347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనున్న విషయం తెలిసిందే.
Admin
Studio18 News