Thursday, 12 March 2026 12:26:16 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో!

Date : 19 January 2026 07:03 PM Views : 248

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస తెలుగువారు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నాలుగు రోజుల పర్యటన సీఎంతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. జనవరి 19, సోమవారం ఉదయం ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా, యూరప్‌లోని ప్రవాస తెలుగువారు, ఎన్నారై టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ కూడా ఉన్నారు. అనంతరం జ్యూరిచ్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జ్యూరిచ్‌లో నాకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు వారికి, ఎన్నారై టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. యూరోప్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా జ్యూరిచ్ వచ్చి నా పట్ల చూపిన అభిమానానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మన తెలుగు భాషకు, సంస్కృతికి ప్రతీకలైన మీ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉంది," అని అన్నారు. జనవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో 'బ్రాండ్ ఆంధ్రప్రదేశ్' ను ప్రపంచానికి పరిచయం చేసి, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొననున్నారు. అంతకుముందు జ్యూరిచ్ విమానాశ్రయంలో సింగపూర్ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబు తన ప్రతినిధి బృందంతో కలిసి రోడ్డు మార్గంలో దావోస్‌కు బయల్దేరి వెళ్లారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :