Sunday, 08 March 2026 10:01:03 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Chandrababu: తిరుమల ఆలయం సెట్టింగ్ ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి?: సీఎం చంద్రబాబు

Date : 21 September 2024 02:49 PM Views : 330

Studio18 News - ANDHRA PRADESH / : మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి రివర్స్ టెండర్లేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల ఆలయం సెట్టింగ్ ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి? అంటూ ఎత్తిపొడిచారు. ఆచారాలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలపై దృష్టి సారించామని... టీటీడీని ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెంచి, పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని చంద్రబాబు వివరించారు. లడ్డూ నాణ్యత పెంచడం కోసం నందిని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేశారని తెలిపారు. ప్రక్షాళన చేయమని చెప్పడం ఆలస్యం... అన్ని పనులు చకచకా చేసేశారని టీటీడీ ఈవో శ్యామలరావును అభినందించారు. ఇవన్నీ ఆయన ప్రతి రోజూ బయటికొచ్చి చెప్పుకోలేదని... ఈవోగా తన పని తాను చేసుకుంటూ పోయారని కితాబిచ్చారు. టీటీడీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తున్నామని... జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంప్రోక్షణ తీరుతెన్నులు ఎలా ఉండాలో సలహాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నాణ్యత పరీక్షలు, సంప్రోక్షణ చేపట్టాలనుకుంటున్నామని... ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :