Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
Also Read : రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు
హోమ్ జాతీయం వార్తలు YS Jagan on Opposition Status: ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు, కష్టాలు అనేవి శాశ్వతం కాదని వెల్లడి ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. Facebook icon Twitter icon Whatsapp icon Linkedin icon Mail icon వార్తలు Hazarath Reddy | Nov 11, 2024 06:44 PM IST A+ A- YS Jagan Slams AP Govt.jpg Vjy, Nov 11: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం.కాని కౌంటర్‌కు స్పీకర్ సమాధానం ఇవ్వడంలేదు.అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.కాని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడంలేదని అన్నారు. ప్రతిపక్ష హోదాను అంగీకరిస్తే, మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అధికారపక్షం అంగీకరించడంలేదు.ప్రతిపక్ష నాయకుడుకి హక్కుగా మైక్, సమయం లభిస్తుందని అన్నారు. అలా ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా ముందుకు రావడంలేదు. 40శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Studio18 News