Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : రాజమండ్రిలో ఓ ఈవెంట్ యాంకర్, ఆమె తండ్రిపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడికి పాల్పడ్డాడు. నల్లూరి శ్రీనివాస్, ఆయన కుమారుడు అభిషేక్ 2021లో యాంకర్, ఈవెంట్ ఆర్గనైజర్ అయిన కావ్యశ్రీ వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అప్పును తీర్చమని అడిగినందుకు తాజాగా కావ్యశ్రీ, ఆమె తండ్రి నాగరాజుపై శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు కావ్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ ఈవెంట్ కోసం రాజమండ్రి వచ్చిన కావ్యశ్రీ డబ్బుల గురించి శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే ఆఫీసుకు రమ్మన్నారని, కానీ, అక్కడికి వెళ్లాక వారు కనిపించలేదని కావ్యశ్రీ పేర్కొన్నారు. దీంతో తండ్రితో కలిసి ఆయన ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతారా? అని బూతులు తిడుతూ తన తండ్రిపై దాడిచేశారని కావ్యశ్రీ ఆరోపించారు. ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తుండటంతో తనపైనా దాడిచేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Admin
Studio18 News