Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : sadhguru jaggi vasudev: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ఇటీవల ల్యాబ్ రిపోర్టు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో నెయ్యి కల్తీపై హిందువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు. అయితే, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయంపై ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది అసహ్యకరమైనదిగా సద్గురు అన్నారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా స్పందించారు. భక్తుల ఆలయ ప్రసాదంలో జంతు మాంసం అనేది అసహ్యకరమైనది. అందుకే దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని అభిప్రాయపడ్డారు. భక్తి లేనిచోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులైన హిందువులచే నిర్వహించబడాలని సద్గురు పేర్కొన్నారు.
Admin
Studio18 News