Studio18 News - ANDHRA PRADESH / : CM Chandrababu Naidu: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కొటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, తాజాగా ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కలెక్టర్లు భవిష్యత్తును ఊహించుకొని పనిచేయాలని అన్నారు. కలెక్టర్ గా ఉన్న సమయంలో చేసే పనులవల్ల ఇమేజ్ శాశ్వతంగా ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు చొప్పున అందజేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Admin
Studio18 News