Saturday, 07 March 2026 08:59:38 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Mithun Reddy: లిక్కర్ కేసులో మరో మలుపు.. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పిటిషన్

Date : 17 September 2025 06:39 PM Views : 136

Studio18 News - ANDHRA PRADESH / : మిథున్ రెడ్డి కస్టడీ కోరుతూ కోర్టులో సిట్ పిటిషన్ ఐదు రోజుల విచారణకు అనుమతి కోరిన దర్యాప్తు బృందం మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ ఇదే కేసులో మరికొందరు నిందితులకు బెయిల్ మంజూరు ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పరిణామం కేసులో మరో కీలక మలుపుగా మారింది. మద్యం స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ విచారణకు అనుమతించాలని సిట్ అధికారులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం, సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో ఆయన లొంగిపోయారు. మరోవైపు, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ విశ్రాంత అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ సీఎం జగన్ కు ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కోర్టు గతంలోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించలేదు. కాగా, ఈ కుంభకోణంలో భాగంగా ఇప్పటికే భారీ మొత్తంలో నగదు, ఆస్తులను అధికారులు జప్తు చేశారు. సిట్ పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :