Thursday, 12 March 2026 01:06:17 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్

Date : 07 February 2026 07:12 PM Views : 123

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : బురద రోడ్డుపై విద్యార్థుల ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గజ్జలవారిపల్లికి రూ.86 లక్షలతో తక్షణమే రోడ్డు మంజూరు కూటమి ప్రభుత్వంలో ఉదయగిరిలో రూ.55 కోట్ల రోడ్ల పనులు ఈ రోడ్డు మంజూరుతో విద్యార్థులు, రైతుల కష్టాలకు తెర "పవన్ సర్.. రోజూ బురదలో నడుస్తూ స్కూలుకు వెళ్లలేకపోతున్నాం. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ విద్యార్థులు చేసిన విన్నపం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించింది. సామాజిక మాధ్యమాల్లోని ఒక వీడియోలో విద్యార్థులు పడుతున్న వేదనను చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ దారి బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తోంది. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, వారు తమ కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శుక్రవారం ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. విద్యార్థుల ఆవేదనను చూసిన ఆయన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలు సిద్ధం చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి విద్యార్థులకే కాకుండా, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి కష్టాలు తీరనున్నాయి. ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 'పల్లెపండగ 1.0, 2.0', సాస్కీ నిధులతో కలిపి సుమారు రూ. 55 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 641 రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి అదనంగా, తాజాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు గజ్జలవారిపల్లి రోడ్డును ప్రత్యేకంగా మంజూరు చేయడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :