Thursday, 12 March 2026 01:12:45 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Nara Lokesh: "ఏ ఫర్ ఆంధ్రా"... 'మనీకంట్రోల్' ఇదే చెబుతోంది: మంత్రి నారా లోకేశ్

Date : 31 December 2025 06:27 PM Views : 118

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : మనీకంట్రోల్ 2025 టెక్ అండ్ స్టార్టప్ గైడ్ విడుదల ఏ-జడ్ లిస్ట్‌లో 'ఏ' ఫర్ ఆంధ్రా అంటూ ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఇండియాస్ న్యూ టెక్ డార్లింగ్ ఏపీనే అన్న మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ఇది నిదర్శనమని ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర సాంకేతిక ప్రగతిపై హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్థిక వార్తా సంస్థ మనీకంట్రోల్ విడుదల చేసిన '2025 టెక్ అండ్ స్టార్టప్ గైడ్'లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రత్యేక గుర్తింపును ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2025 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, మనీకంట్రోల్ సంస్థ ఈ ఏడాది దేశంలోని టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై 'ఏ టు జడ్' (A-Z) పేరుతో ఒక ప్రత్యేక నివేదికను రూపొందించింది. ఇందులో ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం ఒక్కో అక్షరానికి ఒక్కో ట్రెండ్‌ను లేదా అంశాన్ని జోడించారు. ఈ జాబితా 'ఏ' (A) అక్షరంతో మొదలవ్వగా.. దానికి 'ఏ ఫర్ ఆంధ్రా' (A for Andhra) అని నామకరణం చేయడం విశేషం. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. "2025 ఏ టు జడ్ జాబితా ఆంధ్రా పేరుతో మొదలైంది. భారతదేశపు నూతన టెక్ డార్లింగ్‌గా (India's new tech darling) ఆంధ్రా అవతరించింది. భవిష్యత్తును నడిపించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది" అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మారుతున్న టెక్నాలజీ ముఖచిత్రానికి, పెరుగుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక శక్తిగా మారుతోందని, పెట్టుబడులకు, ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్ర బిందువుగా నిలుస్తోందని మనీకంట్రోల్ కథనం పేర్కొన్నట్లు సమాచారం. ఈ గుర్తింపు పట్ల ఐటీ వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :