Monday, 02 December 2024 01:05:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్..

Date : 09 October 2024 11:38 AM Views : 20

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Deputy CM Pawan Kalyan Visits Indrakeeladri: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రిపైనున్న కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని దుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఏడోరోజు దుర్గాదేవి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దీనికితోడు ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం 9గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ 9.30గంటలకు ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ తోపాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. జగన్మాతకు పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. పవన్ రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు