Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2లక్షలు వసూలు చేస్తోంది. దీంతో ఏపీ సర్కార్ ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరింది. బుధవారం రాత్రి వరకు మొత్తం 57,709 దరఖాస్తులు రాగా.. ఫీజు రూపంలో రూ. 1154. 18 కోట్ల ఆదాయం సమకూరింది. ఇవాళ, రేపు కూడా దరఖాస్తులకు అవకాశం ఉంది. దీంతో మరో 40వేల వరకు దరఖాస్తులు రావొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా వత్సవాయిలో రెండు దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే అత్యధికంగా ఎన్‌టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 దుకాణాలు ఉన్నాయి. ఇక వచ్చిన దరఖాస్తుల నుంచి లాటరీ తీసి, దుకాణదారులను ఎంపిక చేస్తారు. 16 నుంచి దుకాణాలను కేటాయిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆ రోజు నుంచే కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తుంది.
Admin
Studio18 News