Studio18 News - ANDHRA PRADESH / : Ambati Rambabu : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శక్రవారం తీర్పునిచ్చింది. లడ్డూ కల్తీ విషయాన్ని నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని, దర్యాప్తు బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. సుప్రీంకోర్టు వేసిన సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నామని అంబటి రాంబాబు చెప్పారు. స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ వేయడం న్యాయం గెలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. కాని, రాష్ట్రం నుంచి వచ్చే ఇద్దరు అధికారులు చంద్రబాబుకు పనిచేసే అధికారులు కాకుండా చూడాలని, సీనియర్ అధికారులు చాలా మంది ఉన్నారని, వారిని స్వతంత్ర సిట్ దర్యాప్తు బృందంలో వేయాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. భక్తులు తిన్న ప్రసాదం జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు.. దీనిని నిరూపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న అధికారులను వేశారు. దానిని సుప్రీంకోర్టు రద్దు చేయడం శుభపరిణామం అని అంబటి రాంబాబు అన్నారు.
Admin
Studio18 News