Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు. రౌడీషీటర్ దాడిలో చనిపోయిన తెనాలికి చెందిన యువతి సహానా ఫ్యామిలీని పరామర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం వైఎస్ఆర్ జిల్లా బద్వేల్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు బయల్దేరుతారు. ఇక రాత్రికి అక్కడే బస చేస్తారని సమాచారం.
Admin
Studio18 News