Thursday, 12 March 2026 01:04:12 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

CP Radhakrishnan: పెట్టుబడిదారులను ఆకర్షించడంలో చంద్రబాబు ముందుంటారు

Date : 14 November 2025 07:07 PM Views : 186

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వ్యాపార అనుకూల రాష్ట్రంగా (Business-Friendly State) నిలిచిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో (CII Partnership Summit) ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందని ఉపరాష్ట్రపతి చెప్పారు. దేశంలో పేదరికం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కార్మిక చట్టాలు, పన్నుల విధానంలో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో గడిచిన 11 ఏళ్లుగా దేశం స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. "సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది" అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. "మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాకు స్నేహితుడు" అని ఆయన అన్నారు. "పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్లే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు" అని సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న ఈ అనుకూల వాతావరణాన్ని వినియోగించుకోవాలని ఆయన అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :