Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలోని ఫర్నీచర్‌పై ప్రభుత్వానికి వైసీపీ లేఖ రాయడంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. జగన్ తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. "జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లులా దోచేశారు. చివరికి సీఎం పదవి నుంచి జగన్‌ని జనం దించేసినా.. సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్ .. తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద రావు ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తు తెచ్చుకో జగన్" అంటూ లోకేశ్ చురకలంటించారు.
Admin
Studio18 News