Thursday, 12 March 2026 12:22:06 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేమే చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు

Date : 05 February 2026 07:30 PM Views : 34

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ ఉండదని కీలక హామీ వైసీపీ ప్రభుత్వంలో పెండింగులో ఉన్న బిల్లులు కూడా చెల్లిస్తామని భరోసా పరుగెత్తే నీటిని నిలిపి భూగర్భ జలాలు పెంచాలని సంఘాలకు సూచన ప్రత్యామ్నాయ పంటలతో రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించే బాధ్యత తమదేనని ఆయన కీలక హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "నీటి భద్రత అందరికీ అవసరం కానీ, దాని సంరక్షణపై చాలా మందికి శ్రద్ధ లేదు. పరుగెత్తే నీటిని నిలపాలి, నడిచే నీటిని జలాశయంగా మార్చాలి. అప్పుడే భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది" అని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 40 జీవనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే కరవు అనే మాటే వినిపించదని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాన్ని, ఇప్పుడు రైతులకు అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తున్నామని తెలిపారు. సాగునీటి సంఘాలకు నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నందున, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత వాటిపైనే ఉందని సీఎం దిశానిర్దేశం చేశారు. నీటి పన్నులు వసూలు చేసుకుని, ఆ నిధులతో కాలువల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చని సూచించారు. రాష్ట్రంలో 6,700 నీటి వినియోగదారుల సంఘాలు, 58 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సరైన సమయంలో నీరందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తూ, భూగర్భ జలాల పెంపు, కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :