Thursday, 12 March 2026 12:56:02 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chandrababu Naidu: పవన్ కల్యాణ్ పనితీరు అద్భుతం.. అధికారుల తీరు మారాలి: చంద్రబాబు

Date : 17 December 2025 07:54 PM Views : 131

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కలెక్టర్ల సదస్సులో పవన్ కల్యాణ్‌పై చంద్రబాబు ప్రశంసలు విభిన్న రంగం నుంచి వచ్చినా పాలనలో అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడిన సీఎం కానిస్టేబుల్ కోరిక మేరకు పవన్ అక్కడికక్కడే రోడ్డు మంజూరు చేయించారని వెల్లడి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. విభిన్న రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, పరిపాలనలో పవన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పవన్ పనితీరుకు ఓ ఉదాహరణను వివరించారు. తాజాగా 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో, ఓ కానిస్టేబుల్ తన గ్రామానికి సరైన రోడ్డు లేదని ప్రస్తావించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విషయంపై పవన్ తక్షణమే స్పందించారని తెలిపారు. తన శాఖ అధికారులతో మాట్లాడి, అదే వేదికపై నుంచి ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని వెల్లడించారు. ఈ వేగవంతమైన పనితీరు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అనంతరం అధికారుల పనితీరుపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులు మొక్కుబడిగా కాకుండా, అర్థవంతమైన చర్చలతో జరగాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. "వ్యవస్థలోని లోపాలను అలుసుగా తీసుకుని కొందరు పనుల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపిస్తున్నారు. ఈ విధానం మారాలి. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాలి" అని చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత పాలన ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. లోకేశ్ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చారని, ప్రతి శాఖ ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్వీర్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకున్నప్పుడే ప్రజల్లో సంతృప్తి పెరుగుతుందని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :