Saturday, 07 March 2026 08:39:33 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టుపై గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్‌లో ఇక్కడి నుంచి విమాన

Date : 13 September 2025 09:09 PM Views : 671

Studio18 News - ANDHRA PRADESH / Anantpur : Bhogapuram Airport | భోగాపురం ఎయిర్‌పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్‌లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం కేంద్రమంత్రి పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు, తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం కింజారపు రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 86 శాతం నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. రన్‌ వే, ఎర్త్‌ వర్క్‌, ట్యాక్సీ స్టాండ్‌ వంటి పనులు వంద శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. టెర్మినల్‌ 79 శాతం, ఏటీసీ 90 శాతం, బిల్డింగ్స్‌ 62 శాతం, కనెక్టింగ్‌ రోడ్లు 68 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 2026 జూన్‌లో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించారు.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. దీనిపై ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు నిర్వహించామని.. మొత్తం ఏడు పాయింట్లు గుర్తించామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోగా ఈ రహదారులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా బీచ్‌ కారిడార్‌ పనులను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీచ్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ను మార్చారని ఆరోపించారు. బీచ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం కూడా డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వైజాగ్‌ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించామని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :