Sunday, 25 January 2026 05:50:35 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

sabarimala yatra: సికింద్రాబాద్ నుంచి శబరిమలకు భారత్ గౌరవ్ రైలు... వివరాలు ఇవిగో!

Date : 22 October 2024 12:42 PM Views : 384

Studio18 News - ANDHRA PRADESH / : శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్‌కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ ట్రైన్ వివరాలు వెల్లడించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం, ఎర్నాకుళం చొటానిక్కర్ అమ్మవారి ఆలయాలను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న ఈ ట్రైన్ లో సికింద్రాబాద్, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు. రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్‌లలో ప్రయాణీకులు ఎక్కే అవకాశం కల్పించారు. నవంబర్ 16న ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక ట్రైన్ సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూరుకు చేరుకుంటుంది. అక్కడ దిగిన తరువాత రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నీలక్కళ్ నుండి చోటానిక్కర (ఎర్నాకులం) వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7 గంటలకు చోటానిక్కర్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని .. రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఎర్నాకులం టౌన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక ప్యాకేజీ వివరాలకు వస్తే .. ఎకానమీ కేటగిరిలో ఒక్కో టికెట్ ధర రూ.11,475, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.10,655లు చెల్లించాలి. స్టాండర్డ్ (3ఏసీ) కేటగిరీలో రూ.18,790లు, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.17,700లు చెల్లించాలి. కంఫర్ట్ (2ఏసీ) కేటగిరీలో రూ.24,215లు, 5- 11 ఏళ్ల మధ్య చిన్నారులైతే రూ.22,910లు చెల్లించాలి. ప్రయాణీకులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బంది ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :