Sunday, 08 March 2026 09:56:58 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

నిజాయతీపరులైన జర్నలిస్టులకు ఈ తీర్పు వజ్రాయుధం లాంటిది: రోజా

Date : 13 June 2025 04:05 PM Views : 532

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. ఆయన అరెస్ట్‌ను అక్రమమైనదిగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతేకాకుండా, శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎటువంటి సంబంధం లేదని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ పరిణామంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని గారి అరెస్ట్‌ను అక్రమమని సుప్రీంకోర్టు తేల్చింది. వెంటనే విడుదల చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం రక్షణపై ఇది గట్టి సందేశం. సాక్షి టీవీపై విషప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిది. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజాయతీపరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధంలాంటి తీర్పు" అని రోజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :